ఇవే నాకు చివరి ఎన్నికలు కావొచ్చు: అక్బరుద్దీన్ ఒవైసీ

Submitted by chandram on Mon, 12/03/2018 - 11:14
Akbaruddin

ఈ ఎన్నికలే తన చివరి ఎన్నికలని చెప్పారు చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన ఆయన తనకు ఆరోగ్యం అస్సలు బాగోలేదని చెప్పారు. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిపారు. తన కిడ్నీలు పూర్తిగా పాడైపోయాయని, కిడ్నీల దగ్గర కొన్ని తూటాల ముక్కలు ఉన్నాయని చెప్పారు. కొన్ని రోజుల కిందటే పరిస్థితి చేయి దాటిపోయిందని, డయాలసిస్ చేయించుకోవాలని  వైద్యులు చెప్పారని అక్బరుద్దీన్ చెప్పారు. హాస్పిటల్స్, స్కూళ్లు, దారుసలాం బ్యాంకులు చూసుకోవడానికే తనకు సమయం సరిపోతుందని, అనారోగ్యం కారణంగా ఇప్పటికే అక్బర్ కొన్ని ఎన్నికల సభల్లో హజరుకాలేకపోయారట.

English Title
My health is not really good- This is my last election: Akbaruddin Owaisi

MORE FROM AUTHOR

RELATED ARTICLES