మూడేళ్లలో మోదీ సర్కార్ పబ్లిసిటీ ఖర్చెంతో తెలిస్తే షాక్ అవుతారు!

మూడేళ్లలో మోదీ సర్కార్ పబ్లిసిటీ ఖర్చెంతో తెలిస్తే షాక్ అవుతారు!
x
Highlights

అప్‌కీ బార్‌ మోదీ సర్కార్‌... ఇది ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు సాగిన ప్రచారం. ఆ సమయంలో ఈ పేరుతో వాణిజ్య ప్రకటనలు హోరెత్తించాయి. తర్వాత బీజేపీ...

అప్‌కీ బార్‌ మోదీ సర్కార్‌... ఇది ప్రధాని మోదీ ఎన్నికలకు ముందు సాగిన ప్రచారం. ఆ సమయంలో ఈ పేరుతో వాణిజ్య ప్రకటనలు హోరెత్తించాయి. తర్వాత బీజేపీ గెలిచింది.. మోదీ ప్రధాని పదవి అందుకున్నారు. ఆ తర్వాత కూడా ఆ ప్రచార హోరు తగ్గలేదు. పబ్లిసిటీ జోరు ఆగలేదు. ప్రతి రోజు ప్రధాని ప్రకటనలు పేపర్లు, టీవీల్లో సర్వసాధారణం అయ్యాయి. స్వచ్ఛ్‌ భారత్‌ నుంచి యూనిటీ రన్‌ వరకు.. మేకిన్‌ ఇండియా నుంచి నోట్ల రద్దు వరకు ప్రతి రోజు యాడ్‌ తప్పనిసరైపోయింది. ఎక్కడా చూసిన హోర్డింగ్‌లు, ప్రకటనలు.. ఇలా మోదీ సర్కార్‌పై ప్రచారం హోరెత్తిపోయింది. ఈ రేంజ్‌ ప్రచారానికి పెట్టిన ఖర్చు.. ఇపుడు మైండ్‌ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది.

మోదీ అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేండ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటనల కోసమే ధారపోసిన సొమ్ము అక్షరాల 3,754 కోట్ల, ఆరు లక్షల, 23 వేల, 616 రూపాయలు. ఇందులో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారానికి రూ.1,656 కోట్లు ఖర్చుపెట్టగా, ప్రింట్ మీడియాలో ప్రచారానికి రూ.1,698 కోట్లు ఖర్చుచేశారు. హోర్డింగ్స్, పోస్టర్స్, బుక్‌లెట్స్, క్యాలెండర్స్ లాంటి ఔట్‌డోర్ అడ్వర్టయిజ్‌మెంట్లకు మరో రూ.399 కోట్లు ఖర్చుపెట్టారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది. గ్రేటర్ నోయిడాకు చెందిన రాంవీర్ తన్వార్ అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐకి ఆర్జీ పెట్టుకోవటంతో ఈ వివరాలు బయటకొచ్చాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కొన్ని పథకాలకు బడ్జెట్‌లో కేటాయిస్తున్న నిధులకంటే ప్రచార ప్రకటనలకు వెచ్చిస్తున్న సొమ్ము అధికంగా ఉండటం విమర్శలకు తావిస్తున్నది. గడిచిన మూడేండ్లలో కాలుష్య నియంత్రణ చర్యలకు కేవలం రూ.56.8 కోట్లు మాత్రమే కేటాయించిన కేంద్ర ప్రభుత్వం అడ్వర్టయిజ్‌మెంట్ల కోసం ఏడాదికి సగటున వెయ్యి కోట్లకు పైగానే ఖర్చుపెడుతున్నది.

Show Full Article
Print Article
Next Story
More Stories