మార్కెట్లోకి మరో కొత్త MI M2 ఫోన్..

Submitted by nanireddy on Thu, 07/26/2018 - 11:05
mobile-phones-xiaomi

మొబైల్ మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే స్మార్ట్ ఫోన్ కంపెనీలలో షియోమీ ఒకటి. రెడీమి 4A ,నోట్ 5 ప్రో వంటి ఆకర్షణీయమైన ఫోన్లను అతితక్కువధరకే వినియోగదారులకి అందుబాటులోకి తెచ్చిన షియోమీ ఆగష్టు 8వ తేదీన ఎంఐ ఎ2ని భారత మార్కెట్లోకి తీసుకువస్తోంది. 4జీబీ తో పాటు 6జీబీ వేరియంట్లలో ఎంఐ ఎ2 ఫోన్‌ని విడుదల చేశారు. ధర విషయానికి వస్తే 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీ గల స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,000 ఉండగా.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ గల స్మార్ట్‌ఫోన్ ధర రూ.22,500లుగా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ గల స్మార్ట్‌ఫోన్ ధర రూ.28,100గా నిర్ణయించింది షియోమీ.

5.99″ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
3/4/6 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
12/20 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
20 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ

English Title
mobile-phones-xiaomi

MORE FROM AUTHOR

RELATED ARTICLES