గ్లోబల్ సిటీగా హైదరాబాద్ : కేటీఆర్

గ్లోబల్ సిటీగా హైదరాబాద్ : కేటీఆర్
x
Highlights

హైదరాబాద్ గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతుందుతోందని ఆపద్దర్మ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నారు. మాదాపూర్‌లో ఐటీ కంపెనీల సీఈవోలు, ఐటీ ఉద్యోగులు...

హైదరాబాద్ గ్లోబల్ సిటీగా రూపాంతరం చెందుతుందుతోందని ఆపద్దర్మ మంత్రి కల్వకుంట్ల రామారావు అన్నారు. మాదాపూర్‌లో ఐటీ కంపెనీల సీఈవోలు, ఐటీ ఉద్యోగులు నిర్వహించిన స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్ కార్యక్రమంలో ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కెటిఆర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే శవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలతోనే భాగ్యనగరం గ్లోబల్ సిటీగా మారుతోందన్నారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్ లో హైదరాబాద్ బెస్ట్ అని కేటీఆర్ వ్యాఖ్యనించారు. మైక్రోసాఫ్ట్ లాంటి ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ లో తమ సేవలు విస్తరించాయని కేటీఆర్ తెలిపారు. ఏడాదిలోనే హైదరాబాద్ మెట్రోలో మూడు కోట్ల మందికి పైగా ప్రయాణించారు. త్వరలో హైదరాబాద్ నగరంలో మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. నగరంలో విలైనంత కాలుష్యం తగ్గించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నామని, శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు మెట్రో లైన్ పొడిగిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయంలో 43 శాతం సంక్షేమం కోసం వినియోగిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories