వాజ్‌పేయికి నివాళి ఎందుకన్నాడు.. చెప్పుదెబ్బలు తిన్నాడు..

x
Highlights

వాజ్‌పేయి అంత్యక్రియల వేళ..మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీజేపీ, ఎంఐఎం మధ్య గొడవ జరిగింది. అటల్‌జీ మృతి పట్ల సంతాపం తెలిపే తీర్మానాన్ని...

వాజ్‌పేయి అంత్యక్రియల వేళ..మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీజేపీ, ఎంఐఎం మధ్య గొడవ జరిగింది. అటల్‌జీ మృతి పట్ల సంతాపం తెలిపే తీర్మానాన్ని వ్యతిరేకించినందుకు ఎంఐఎం కార్పొరేటర్‌పై బీజేపీ సభ్యులు దాడికి దిగారు. దాంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణ జరిగింది. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ బాడీ మీటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. వాజ్‌పేయికి నివాళులర్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశమైంది. నివాళులర్పిస్తున్నసమయంలో ఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మతీన్ వ్యతిరేకించాడు. మహానేతను తలుచుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తుండగా అడ్డుకున్నారు. ఆయనకు ఎందుకు నివాళి అర్పించాలని, తాను ఆ పని చేయనని అన్నారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు మతీన్‌పై దాడి చేశారు. పురుష కార్పొరేటర్లు పిడిగుద్దులు గుద్దితే, మహిళా కార్పొరేటర్లు చెప్పులతో చెంపలు వాయించారు. మేయర్ వద్దని చెప్పిన ఏ కార్పొరేటర్ కూడా దాడిని ఆపలేదు. అఖరికి పోలీసులు రావడంతో బతికి బయట పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంత గొప్పనేతను అగౌరపరిచేలా చేసిన కార్పొరేటర్ మతీన్‌కు మంచి బుద్దిచెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories