రోడ్డు క్రాస్‌ చేస్తున్న పెద్దాయనను ఢీకొన్న బైక్‌...300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన బైకిస్ట్‌

x
Highlights

వాహనాల రద్దీ హైదరాబాద్‌ వాసులను భయపెడుతోంది. రోడ్డు దాటాలంటే హడలిపోతున్నారు పాదచారులు. మెరుపు వేగంతో దూసుకురావడంతో పాటు రెప్పపాటులో బీభత్సం...

వాహనాల రద్దీ హైదరాబాద్‌ వాసులను భయపెడుతోంది. రోడ్డు దాటాలంటే హడలిపోతున్నారు పాదచారులు. మెరుపు వేగంతో దూసుకురావడంతో పాటు రెప్పపాటులో బీభత్సం సృష్టిస్తున్నాయి. తరచుగా జరుగుతున్నా రోడ్డు ప్రమాదాలతో కొంత మంది ప్రాణాలు కోల్పోతే మరికొంతమంది గాయాలపాలవుతున్నారు. అయితే ట్యాంక్‌బండ్‌పై ఓ బైకిస్ట్‌ పెద్దాయనను ఈడ్చుకెళ్లిన విజువల్స్‌ ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి సల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈనెల 14న ట్యాంక్‌బండ్‌ సమీపంలోని జీబ్రా క్రాసింగ్‌ దగ్గర రోడ్డు క్రాస్‌ చేయాలన్న కంగారులో స్నిగల్‌ కూడా చూసుకోకుండా కాస్త గ్యాప్‌ దొరకడంతో వాహనాలను దాటేందుకు పరుగులు తీశారు పెద్దాయన వెంకటేశ్వరరావు. బస్సును దాటి కాస్త ముందుకు రాగానే వేగంగా వచ్చిన బైక్‌ ఆ పెద్దాయనను ఢీకోవడంతో ఎగిరి బైక్‌పైనే పడ్డాడు. స్పీడ్‌గా వెళ్తున్న బైకిస్ట్‌ బండిని బ్యాలెన్స్‌ చేసే క్రమంలో దాదాపు 300 మీటర్లు వరకు ఈడ్చుకెళ్లాడు. ఈ విజువల్స్‌ అక్కడి సీసీ కెమెరాల్లో చిక్కాయి. అయితే ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరావు స్పల్పగాయాలతో బయటపడ్డాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories