కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు ఎన్‌కౌంటర్‌!

Submitted by arun on Fri, 10/12/2018 - 14:47
Meena

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో పాల్గొన్న మీనాను పోలీసులు ఈ రోజు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పులు మన్యంలో ఉద్రిక్తతకు దారితీశాయి. విశాఖ మన్యంలోని పెదబయలు, ఒడిశా సరిహద్దు జామిగుడ పంచాయతీ ఆండ్రపల్లి కొండల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతి చెందింది. మృతి చెందిన మావోయిస్టును మీనాగా గుర్తించారు. ఈమె మావోయిస్టు పార్టీలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేస్తున్నారు. మీనా భర్త ఉదరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా, ఎంకేవీ మల్కన్‌గిరి.. కోరాపుట్‌ విశాఖ జోన్‌ కార్యదర్శిగా విధులు చేపడుతున్నారు. మహిళా మావోయిస్టు మీనా, ఎమ్మెల్యే హత్య కేసులో నిందితురాలు. ఎదురు కాల్పుల్లో మరికొంత మంది మావోయిస్టులు గాయపడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు నిర్వహించిన ఈ కూంబింగ్‌లో నలుగురు మావోయిస్టులు జయంతి, రాధిక, గీత, రాజశేఖర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలానికి చెందిన మీనా గత 20 ఏళ్లుగా మావోయిస్టుగా ఉంటున్నారు. మీనా మృతి చెందినట్టు వార్తలు రావడంతో ఖానాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 

Tags
English Title
maoist killed police encounter vishaka agency

MORE FROM AUTHOR

RELATED ARTICLES