మంత్రి కాన్వాయ్‌పై బాధిత కుటుంబాల దాడి

Submitted by arun on Mon, 06/25/2018 - 17:32
mah

తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, ఈ ఉదయం రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు కూరగాయలను ఆటోలో వేసుకుని, హైదరాబాద్ బయలుదేరారు. లింగంపల్లి వద్దకు రాగానే... ఎదురుగా వేగంగా వస్తున్న ఓ కారు అదుపుతప్పి ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మద్యం మత్తులో యువకులు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.  ఈ ఘటనపై ఆగ్రహాం వ్యక్తం చేసిన బాధితుల బంధువులు మృతదేహాలతో మంచాల రహదారిపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు ఘటనాస్థలానికి వచ్చిన మంత్రి మహేందర్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. మృతులు కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో మంత్రి బాధిత కుటుంబాలతో చర్చలు జరుపుతున్నారు. ఇది చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు.

English Title
manchal-road-accident-relatives-protes

MORE FROM AUTHOR

RELATED ARTICLES