భార్య విడాకులు కోరిందని.. ఊహించని షాకిచ్చిన భర్త..!

భార్య విడాకులు కోరిందని.. ఊహించని షాకిచ్చిన భర్త..!
x
Highlights

విడాకుల నోటీసులు పంపిందనే ఆగ్రహంతో ఓ వ్యక్తి.. తన భార్య ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో చోటుచేసుకున్నది. తిరునల్వేలి...

విడాకుల నోటీసులు పంపిందనే ఆగ్రహంతో ఓ వ్యక్తి.. తన భార్య ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరునెల్వేలిలో చోటుచేసుకున్నది. తిరునల్వేలి వన్నార్‌పేటకు చెందిన సెల్వి (30), తూత్తుకుడికి చెందిన శరవణన్‌ (32) అనే వ్యక్తిని ఫిబ్రవరిలో వివాహం చేసుకుంది. ఇరువురూ తూత్తుకుడి లో కాపురం చేస్తున్నారు. తాగుబోతు అయిన అతను.. నిత్యం భార్యతో గొడవపడేవాడు. భర్త వేధింపులను భరించలేక శరవణన్ భార్య విడాకుల కోసం కోర్టులో కేసు వేసింది. శనివారం రాత్రి తప్పతాగి భార్య ఇంటికి వెళ్లిన శరవణన్.. ఆమె ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరాడు. మంటల కారణంగా ఇంట్లో పార్క్‌చేసిన రెండు మోటర్‌బైక్‌లు కాలిపోయాయి. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories