బతికున్న పామును మింగి.. 4 గంటల్లోనే

Submitted by arun on Fri, 09/14/2018 - 10:53

ఫుల్లుగా తాగి ఉన్న వ్యక్తిని ఆకతాయిలు రెచ్చగొట్టడంతో ఓ పాము పిల్లను అమాంతం మింగేశాడు. 4 గంటల్లో ఒళ్లంతా విషం వ్యాపించి అతను చనిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమ్‌రోహ జిల్లాలో కార్మికుడిగా జీవనం సాగిస్తున్న మహిపాల్ సింగ్(40) బుధవారం ఫుల్లుగా తాగి ఇంటికి వస్తుండగా అతనికి రోడ్డు పక్కన ఓ పాము పిల్ల కనిపించింది. దాన్ని తీసుకొని సరదాగా ఆడుకుంటుండగా కొందరు ఆకతాయిలు అక్కడికి చేరుకుని ఫోన్లలో వీడియోలు తీయడం ప్రారంభించారు. దీంతో మరింత రెచ్చిపోయిన సింగ్‌ పాముపిల్లను తన పిడికిలిలో పట్టుకుని, రోడ్డుపై వేసి, తలమీద పెట్టుకుంటూ ఆటలాడసాగాడు. ఇంతలోనే ఓ ఆకతాయి పామును నోట్లో పెట్టుకుంటావా? అని అడగడంతో సింగ్‌ వెంటనే తన నోట్లో పెట్టుకున్నాడు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. నోట్లో పెట్టుకున్న పాము కాస్తా చేతిలో నుంచి జారీ గొంతులోంచి లోపలికి వెళ్లిపోయింది. వాంతులు చేస్తూ ఎంత ప్రయంత్నించినా లోపలికి వెళ్లిన పాము బటయకు రాలేదు. చివరకు 4 గంటల్లోపే పాము విషం అతని ఒళ్లంతా వ్యాపించి చనిపోయాడు.

English Title
UP: Man allegedly swallows live snake, dies 4 hours later

MORE FROM AUTHOR

RELATED ARTICLES