గ్రూప్ ఫోర్ పరీక్ష రాస్తున్న తల్లి... ఏడుస్తున్న బిడ్డను లాలించిన పోలీసులు..!

Submitted by arun on Sun, 10/07/2018 - 15:32

ఖాకీల్లో కరుడుగట్టిన ముర్ఘత్వమే ఉంటుంది కానీ మానవత్వం ఉండదని చాలా మంది భావిస్తుంటారు. కానీ అలాంటి పోలీసుల్లో కూడా మంచితనం మానవత్వం ఉన్నవాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా మహంకాళి పోలీసులు తమ ఉదారగుణాన్ని చాటుకున్నారు. గ్రూప్ ఫోర్ పరీక్ష సందర్భంగా పరీక్ష రాసేందుకు వచ్చిన తల్లి బిడ్డను బయట కారిడార్‌లో పడుకో బెట్టి వెళ్లింది. పసివాళ్లను లోపలికి అనుమతించరు కాబట్టి బయట వరండాలో చిన్నారిని పడుకోబెట్టింది. అయితే కాసేపటికే చిన్నారి గుక్క పెట్టి ఏడవడంతో పోలీసులంతా అక్కడకు గుమిగూడారు. ఎడుస్తున్న పసికందును లాలించారు. చిన్నారికి పాలడబ్బాలో పాలు తాగించారు. చిన్నారిని ఏడవకుండా మహంకాళి పోలీసులు ఓదార్చారు. అక్కడున్న కొందరు ఔత్సాహికులు ఈ ఫోటోల్ని తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఫోటోలు వైరల్‌గా మారాయి.

English Title
mahankali police console baby while her mother went group-4-exam

MORE FROM AUTHOR

RELATED ARTICLES