టీమిండియా 'లుంగి' ఊడదీశాడు

Submitted by arun on Wed, 01/17/2018 - 16:24
Lungi Ngidi

సౌతాఫ్రికా యువఫాస్ట్ బౌలర్ లుంగీ ఎన్ గిడీ....అరంగేట్రం టెస్టులోనే అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీతో సహా...మొత్తం ఆరుగురు బ్యాట్స్ మన్ ను అవుట్ చేసి...వారేవ్వా! అనిపించుకొన్నాడు. 21 ఏళ్ల వయసులోనే టెస్ట్ అరంగేట్రం చేసిన 99వ సఫారీ క్రికెటర్ గా రికార్డుల్లో చేరిన ఎన్ గిడి..గంటకు 140 కిలోమీటర్ల సగటు వేగంతో...ఇన్ స్వింగర్లు వేసి....టాప్ ర్యాంకర్ టీమిండియా...టాపార్డర్ ను తన తొలిటెస్ట్ మ్యాచ్ లోనే టపటపలాడించాడు. ఓపెనర్ రాహుల్, కెప్టెన్ కొహ్లీ, హార్థిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, బుమ్రాలను... ఎన్ గిడీ అవుట్ చేశాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్ స్థానంలో....తుదిజట్టులో చోటు సంపాదించిన ఎన్ గిడి... ఈ రికార్డుతో... సఫారీజట్టులో తన స్థానం మరింత పదిలం చేసుకోగలిగాడు. ఎన్ గిడీకి ప్లేయర్ ఆఫ్ దిమ్యాచ్ అవార్డు దక్కింది.

English Title
lungi ngidi takes 6 wickets

MORE FROM AUTHOR

RELATED ARTICLES