‘దానం’ అన్నను గెలిపించండి: లగడపాటి పద్మ

‘దానం’ అన్నను గెలిపించండి: లగడపాటి పద్మ
x
Highlights

తెలంగాణలో ఎన్నికల మహాభారత ప్రచారయుద్ధం నిన్నటితో పరిసమాప్తం అయింది. కాగా లగడపాటి చేసిన సర్వేలలో ప్రజలు హస్తంవైపే దువ్వుతున్నారని చెప్పిన విషయం...

తెలంగాణలో ఎన్నికల మహాభారత ప్రచారయుద్ధం నిన్నటితో పరిసమాప్తం అయింది. కాగా లగడపాటి చేసిన సర్వేలలో ప్రజలు హస్తంవైపే దువ్వుతున్నారని చెప్పిన విషయం తెలిసిందే అయితే మరో వైపు లగడపాటి సతీమణి పద్మ మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ కే మద్దతు తెలుపుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఖైరాతాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి దానం నాగేందర్ కు భార్య అనితతో కలిసి మంగళవారం రాత్రి ఖైరతాబాద్‌లో ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమే మాట్లాడుతూ టీఆర్ఎస్ అధిష్ఠానం నిలబెట్టిన అభ్యర్థి దానం నాగేందర్ అన్నను భారీ మోజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంతో మంది అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం ఐదుసంవత్సరాలే అయిందని ఏ ప్రభుత్వం కూడా ఐదేండ్లలో పనులన్నీ పూర్తిచేయలేదన్నారు. పదేళ్లలో అన్ని సమస్యలను పరిష్కరించేందుకు ఈసారి టీఆర్ఎస్ ప్రభుత్వం యత్నం చేస్తుందని తప్పకుండా ఈసారి కూడా కారు గుర్తుకు ఓటేసి దానం నాగేందర్‌ను గెలిపించాలని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories