మహేశ్ బాబు వల్లే బిగ్‌బాస్‌లోకి: కౌశల్

Submitted by arun on Tue, 10/02/2018 - 12:36
koushal

తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వెనక టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ప్రోత్సాహం ఉందని బిగ్‌బాస్-2 విజేత కౌశల్ తెలిపాడు. మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’తోనే తమ మధ్య సాన్నిహిత్యం ఉందన్న కౌశల్.. మహేశ్ బాబు లేకుంటే తాను లేనంటూ కౌశల్ చెప్పిన వీడియోను ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో తొలి మోడలింగ్ అకాడమీ ఏర్పాటు చేసింది నేనే. ఈ విషయంలో మహేశ్ బాబు ఎంతో ప్రోత్సహించారు. రాజకుమారుడు సినిమా చేస్తుంటే దగ్గరుండి ఏజెన్సీ ఏర్పాటు చేయించారు. రాఘవేంద్ర రావు గారు కూడా చాలా సహాయం చేశారు. ఆ మోడలింగ్ ఏజెన్సీ లేకపోతే నేను మూటముల్లే సర్దుకుని వైజాగ్ వెళ్లిపోయేవాడిని’ అంటూ మహేశ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇదిలా ఉంటే తన గెలుపు కోసం కృషి చేసిన కౌశల్ ఆర్మీకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. తన పేరిట ఏర్పాటు చేసిన కౌశల్ ఆర్మీ.. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం ఆనందంగా ఉందన్నాడు.
 

English Title
koushal talk about mahesh babu

MORE FROM AUTHOR

RELATED ARTICLES