మహిళలను చూస్తూ కామాంధుడి వికృత చర్య!

Submitted by nanireddy on Sun, 05/13/2018 - 16:57
kolkata-man-arrested-masturbate-bus

బస్సులో మహిళలను చూస్తూ కామాంధుడు అసభ్య చేష్టలకు పాల్పడ్డాడు. కోల్ కతా లో జరిగిన ఈ ఘటన పోలీసుల కంట పడింది. వివరాల్లోకి వెళితే శనివారం  కోల్‌కతా హూగ్లీ జిల్లా శ్యామ్‌పుకర్‌ బస్సులో వైద్యపతి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బస్సులో ఎక్కాడు.  కొద్దిసేపటితరువాత అతని ప్యాంటు విప్పి మహిళలను చూస్తూ అసభ్య చర్యలకు ఉపక్రమించాడు. దీంతో అతడి చేష్టలతో విస్తుపోయిన కొందరు మహిళలు  మధ్యలోనే బస్సు  దిగిపోయారు. అతని వికృత చేష్టలను గమనించిన ఓ యువతి తన సెల్ ఫోన్ లో దృశ్యాలను  చిత్రీకరించింది. అనంతరం బస్సు కండెక్టర్ కు ఫిర్యాదు చేయగా అతను పట్టించుకోలేదు. దీంతో ఆ యువతి అసభ్య వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కొద్ది సేపటికి అది వైరల్ గా మారి కోల్‌కతా పోలీసులకు చేరింది. వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

English Title
kolkata-man-arrested-masturbate-bus

MORE FROM AUTHOR

RELATED ARTICLES