కేరళకు 700కోట్ల భారీ సాయం ప్రకటించిన అరబ్‌ దేశం!

కేరళకు 700కోట్ల భారీ సాయం ప్రకటించిన అరబ్‌ దేశం!
x
Highlights

కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది...

కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదల్లో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కూడు, గూడు లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చూసిన ఎంతోమంది మేమున్నామంటూ ముందుకొచ్చి ఆర్ధిక సాయం ప్రకటించారు. కేరళ రాష్ట్రాన్ని, వరద బాధితులను ఆదుకోడానికి యావత్ భారత దేశం కదిలింది. అయితే కేవలం భారత దేశమే కాదు ఈ మహావిపత్తుపై చలించి ప్రపంచ దేశాలు కూడా కేరళకు భారీ సాయం చేయడానికి ముందుకు వచ్చాయి. ఇప్పటికే గల్ప్ దేశాల్లో ఒకటైన ఖతార్ రూ.35 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రూ. 700 కోట్ల భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ వెల్లడించారు. ఆర్థిక సాయం గురించి అబుదాబి ప్రిన్స్ ప్రధాని నరేంద్ర మోదీకి వివరించినట్లు విజయన్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories