కత్తి మహేష్ ఇష్యూ పై మొదటిసారి స్పందించిన అయన తండ్రి

కత్తి మహేష్ ఇష్యూ పై మొదటిసారి స్పందించిన అయన తండ్రి
x
Highlights

గత కొన్నాళ్లుగా కత్తి మహేష్ వివాదాల్లో కూరుకుపోతున్నారు. హిందువుల ఆరాధ్యదైవం రాముడిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రముఖ స్వామిజి పరిపూర్ణానంద స్వామిజి...

గత కొన్నాళ్లుగా కత్తి మహేష్ వివాదాల్లో కూరుకుపోతున్నారు. హిందువుల ఆరాధ్యదైవం రాముడిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రముఖ స్వామిజి పరిపూర్ణానంద స్వామిజి ధర్మాగ్రహ యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. అయితే ఈ యాత్రకు పోలీసులు బ్రేక్ వేశారు. ఈ క్రమంలో కత్తి మహేష్ ను ఆరునెలల పాటు నగర బహిష్కరణ చేశారు పోలీసులు. ఇక ఈ ఇస్యూపై కత్తి మహేష్ తండ్రి ఓబులేసు మొదటిసారి స్పందించారు. 'నా కొడుకును కాదు.. హిందువులను రెచ్చగొడుతున్న పరిపూర్ణానందను దేశ బహిష్కరణ చేయాలన్నారు. మహేష్ దళితుడు కాబట్టే బ్రాహ్మణులు అనవసర రార్థాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాముడి గురించి నా కొడుకు మాట్లాడింది నూటికి నూరు శాతం నిజమోనని పేర్కొన్నారు. రామాయణం విష వృక్ష పుస్తకం.. పూర్తిగా చదివితే రాముడు ఎలాంటి వాడో అందరికీ అర్థమవుతోందన్నారు. నా కొడుకు హిందువే.. నాస్తికుడు కాదు.. అస్తికుడేనని తెలిపారు. నా కొడుకు తన భార్యతో కలిసే ఉన్నాడు విడిపోలేదని చెప్పారు. ఈ నెల 4న లక్నో వెళ్లి కుమారుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యారు' అని తెలిపారు

Show Full Article
Print Article
Next Story
More Stories