కరక్కాయల స్కాం కేసులో కీలక నిందితుడి అరెస్ట్

Submitted by arun on Sat, 08/04/2018 - 14:20
Karakaya Powder Scam

కరక్కాయల కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు మల్లికార్జున రెడ్డి తో పాటు మరో ముగ్గురు ని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు వారి నుండి 44 లక్షలు స్వాదీనం చేసుకున్నారు.  సాయంత్రం 4 గంటలకు నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టనున్న సైబరాబాద్ సీపీ సజ్జనర్ తెలిపారు. కరక్కాయలు తీసుకుని పొడి చేసి ఇస్తే వెయ్యికి రూ.300 ఎక్కువగా ఇస్తామంటూ స్కాంను ప్రారంభించి దాదాపు రూ.10కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. పెద్ద సంఖ్యలో బాధితులు ఈ స్కాంలో ఉన్నారు. దీంతో ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఎట్టకేలకు కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను ఈరోజు సాయంత్రం 4 గంటలకు సైబరాబాద్ కమిషన్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
 

English Title
Karakaya Powder Scam

MORE FROM AUTHOR

RELATED ARTICLES