కొండ చిలువతో కాజల్‌ అగర్వాల్

Submitted by arun on Thu, 10/04/2018 - 15:41
 Kajal Aggarwal

తన అందం, అభినయంతో ఎంతో అభిమానులను సొంతం చేసుకున్న నటి కాజల్ అగర్వాల్. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా ఓ చిత్రం ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది. షూటింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్‌ చేస్తూ సందడి చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. హీరోయిన్‌ ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది. దర్శకుడు తేజ తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ వీడియోను షేర్‌ చేశాడు.

English Title
kajal aggarwal with python

MORE FROM AUTHOR

RELATED ARTICLES