కొండ చిలువతో కాజల్ అగర్వాల్

Submitted by nanireddy on Thu, 10/04/2018 - 15:41
kajal-aggarwal-playing-python

చిన్నా పెద్ద తేడా లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటోంది టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా లేకపోయినా ఫుల్ స్వింగ్ లో ఉంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో కలిసి నటిస్తుంది కాజల్‌. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లోని నఖోమ్‌ పాథోమ్‌ ప్రావిన్స్‌లో జరుగుతోంది.ఈ చిత్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా తమాషా వీడియో ఒకటి షేర్ చేశారు. అందులో హీరోయిన్ కాజల్ అగ్వర్వాల్  ఓ భారీ కొండచిలువను మెడలో వేసుకొని కెమెరాకు ఫోజ్‌ ఇస్తున్న వీడియో సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దాంతో అది కాస్త వైరల్ గా మారింది.ఇదిలావుంటే దర్శకుడు తేజ కూడా తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో ఈ వీడియోను షేర్‌ చేశాడు. నిమిషాల వ్యవధిలో వేల వ్యూస్ ను సొంతం చేసుకుంది ఈ వీడియో. 

English Title
kajal-aggarwal-playing-python

MORE FROM AUTHOR

RELATED ARTICLES