సంచలన కేసులో నేడు తుది తీర్పు!

Submitted by nanireddy on Thu, 06/14/2018 - 08:10
judgment-nagavishnavi-murder-case-today

విజయవాడలో సంచలనం రేపిన నాగవైష్ణవి హత్య కేసులో గురువారం తుది తీర్పు వెలువడ నుంది.. ఆస్తుల గొడవలో చిట్టితల్లి నాగవైష్ణవిని ఎనిమిదేళ్ల క్రితం అత్యంత దారుణంగా హత్య చేశారు కిరాతకులు. మర్డర్ తర్వాత నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్లంతా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు....

విజయవాడ ముత్యాలంపాడుకు చెందిన పలగాని ప్రభాకర్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయనకు ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు. వెంకటేశ్వరమ్మకు సంతానం కలగకపోవడంతో నర్మదను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సాయితేజ, నాగవైష్ణవి జన్మించారు. మొదటిభార్యకు కూడా ఒక కొడుకు పుట్టాడు. కానీ నాగవైష్ణవి పుట్టిన తర్వాత వ్యాపారంలో కలిసిరావడంతో తన పుట్టిన రోజున తన గారాలపట్టికి ఇబ్రహీంపట్నంలో ఒక వెంచర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు ప్రభాకర్. రెండో భార్య సంతానానికి ప్రధాన్యతనివ్వడంపై మొదటి భార్య తమ్ముడు పంది వెంకట్రావు పగతో రగిలిపోయాడు. తన అక్క కొడుకును నిర్లక్ష్యం చేస్తున్నాడని బావపై పగ పెంచుకున్న వెంకట్రావు. ఆమె  హత్యకు పథకం వేసాడు. అందులో భాగంగా నాగవైష్ణవిని కిడ్నాప్ చేసి  హత్యా చేశారు అనంతరం గుంటూరులోని ఓ బాయిలర్‌లో పడేసి కాల్చి బూడిద చేశారు. కాగా ఈ కేసులో  తుది తీర్పు నేడు విజయవాడలో మహిళా సెషన్స్‌ జడ్జి గురువారం ఈ కేసులో తుది తీర్పు ఇవ్వనున్నారు. కోర్టు వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. 

English Title
judgment-nagavishnavi-murder-case-today

MORE FROM AUTHOR

RELATED ARTICLES