జనగామలో ఉద్రిక్తత పరిస్థితి..

Submitted by chandram on Fri, 12/07/2018 - 13:33
jangaon

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇక పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు కొలహలంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే .జనగామ జిల్లా కేంద్రంలోని ప్రిస్టన్ కళాశాలలో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. తాము ఎంతో ఆశతో భారత పౌరులుగా తమ ఓటు హక్కును వినియోగించుకుందామని పోలింగ్ కేంద్రం వద్దకు వస్తే తమ ఓటును తొలగించారని కొందరు ఓటు బాధితులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, హన్మకొండ జాతీయ రహదారిపై బైటాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు. దింతో రోడ్లపై వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దింతో రంగంలోకి దిగిన పోలీసులు అడ్డుకునేందుకు యత్నించగా బాధితులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

English Title
jangaon people strike for lose her vote

MORE FROM AUTHOR

RELATED ARTICLES