వైసీపీలో చేరాలనుకుంటున్న ఆనంకు మరో షాక్ !

Submitted by arun on Mon, 08/06/2018 - 12:20
aj

ఆనం రామానారాయణ రెడ్డి.. టీడీపీ ని వీడి.. వైసీపీలోకి వెళ్లాలనుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలలుగా ఆయన పార్టీ మారేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు. తాను పోటీచేయాలనుకున్న నియోజకవర్గం కన్ ఫామ్ అయితే.. వెంటనే పార్టీ మారాలని ఆయన భావిస్తున్నారు. కానీ.. ఇంతలోనే ఆనంకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇంతకీ మ్యాటరేంటంటే.. బిజేపీ నేత నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. గత కొంతకాలంగా ఆయన పార్టీ మారతారనే వార్తలు వినపడుతున్నాయి. దీనిని అడ్డుకునేందుకు ఆయనకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కూడా కట్టబెట్టారు. అయితే.. ఆ పదవిని ఖాతరు చేయకుండా నేదురుమల్లి వైసీపీలో చేరేందుకే సిద్ధమయ్యారు.

శనివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శిబిరంలో రామ్‌కుమార్‌రెడ్డి జగన్‌తో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడారు. తను ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరడానికి సమ్మతించినట్లు తెలిసింది. ఇక త్వరలో తేదీలు ప్రకటించి తన అనుచరులతో కలిసి పార్టీలో చేరుతానని నేదురుమల్లి, జగన్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ కలయికతో నేదురుమల్లి బీజేపీని వీడనున్నట్లు స్పష్టం అవుతోంది. నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి చేరిక క్రమంలో వెంకటగిరి వైసీపీ అభ్యర్థుల జాబితా పెరిగింది. ఆయన జగన్‌ను కలిసిన నేపథ్యంలో ఇతనే వెంకటగిరి వైసీపీ అభ్యర్థి అవుతారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. నేదురుమల్లి అనుచరులు సైతం అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నియోజకవర్గంలో టిక్కెట్టు కోసం ఇప్పటికే పలువురు పోటీ పడుతున్నారు.
 
ఆనం రామనారాయణరెడ్డికి వెంకటగిరి కేటాయిస్తారనే బలమైన ప్రచారం జరుగుతోంది. దీనికితోడు జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి నాలుగేళ్లుగా ఈ టిక్కెట్టుపైనే ఆశలు పెట్టుకున్నారు. రామ్‌ప్రసాద్‌రెడ్డికి కూడా ఆశిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్ద్దీ వెంకటగిరి వైసీపీలో ఆశావహుల జాబితా పెరుగుతుండడం దేనికి సంకేతాలో... అనే అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్టు దక్కని పక్షంలో ఈ నేతలు ఎలా స్పందిస్తారో, కొత్తనేతల చేరిక వెంకటగిరి వైసీపీకి బలుపో, వాపో కాలమే నిర్ణయించాల్సి ఉంది.

English Title
jagan shock to anam ramanarayana reddy

MORE FROM AUTHOR

RELATED ARTICLES