బైక్‌ను ఢీకొన్న ఇన్నోవా...ఒకరు మృతి

Submitted by arun on Fri, 08/10/2018 - 12:13
 Road Accident

యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బీబీ నగర్‌ మండలం కొండమడుగు దగ్గర జాతీయ రహదారిపై ఓ బైక్‌ను ఇన్నోవా కారు ఢీ కొట్టిన ఘటనలో ఓ విద్యార్థీ ప్రాణాలు కోల్పోయాడు. ఇంజనీరింగ్‌ పరీక్షలు రాసేందుకు ఒకే బైక్‌పై ముగ్గురు స్టూడెంట్స్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా దూసుకొచ్చిన ఇన్నోవా బైక్‌ను బలంగా ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు సినిమా సీన్‌ను తలపించేలా ఎగిరిపడ్డారు. మిగతా ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి శివకుమార్ సీఎస్‌ఈ రెండో యేడాది చదువుతున్నాడు. ఇటు మృతుడి బంధవులు కన్నీరుమున్నీరవుతుండగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 
 

English Title
Innova Car hits bike 1 lost life

MORE FROM AUTHOR

RELATED ARTICLES