అయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది : నటుడు మోహన్‌బాబు

అయనను ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది : నటుడు మోహన్‌బాబు
x
Highlights

విలక్షణ నటుడు మోహన్‌బాబు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓ వ్యక్తిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయన ఈ...

విలక్షణ నటుడు మోహన్‌బాబు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఓ వ్యక్తిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయన ఈ వ్యాఖ్యలు చేసింది తెలుగు రాజకీయాలపై కాదు. తెలుగు నేతలపై అంతకన్నా కాదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్ పై.. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సంస్మరణ సభ ఆదివారం కోయంబత్తూరులో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన విషయాన్ని మోహన్‌బాబు ట్విట్టర్‌ ద్వారా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను తమిళనాడు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందని అన్నారు. కరుణానిధి తనయుడు స్టాలిన్‌ ఆహ్వానం మేరకు తాను కరుణానిధి సంస్మరణ సభలో పాల్గొన్నానని, ఈ సభకు తనను ఆహ్వానించినందుకు సోదరుడు స్టాలిన్‌కు ధన్యవాదాలని ఆయన పేర్కొన్నారు మోహన్ బాబు. ఈ సందర్భంగా స్టాలిన్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్తూ.. ఆయనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories