తల్లి ఎదుటే కూతురిపై అత్యాచారం

తల్లి ఎదుటే కూతురిపై అత్యాచారం
x
Highlights

హైదరాబాద్‌ చిలకలగూడలో రౌడ్‌ షీటర్‌ అమీర్ హల్‌చల్‌ చేశాడు. బ్లేడ్‌తో కోసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట హంగామా చేశాడు. మూడు రోజుల క్రితం తనపై నమోదైన...

హైదరాబాద్‌ చిలకలగూడలో రౌడ్‌ షీటర్‌ అమీర్ హల్‌చల్‌ చేశాడు. బ్లేడ్‌తో కోసుకుంటూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట హంగామా చేశాడు. మూడు రోజుల క్రితం తనపై నమోదైన అత్యాచారం కేసును కొట్టివేయాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో బ్లేడ్‌తో కోసుకుంటూ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాడు. తన కుమార్తెపై అమీర్ అత్యాచారం జరిపాడంటూ మూడు రోజుల క్రితం ఓ మహిళ ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అమీర్‌ కోసం గాలిస్తుండగా ఈ ఘటన చోట చేసుకుంది.
గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. వారాసిగూడ అంబర్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్‌ షేక్‌ అమీర్‌(33)కు వివాహమై ముగ్గురు పిల్లలున్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న..తన ఇంటికి సమీపంలో ఉండే యువతి ఇంట్లో చొరబడిన అమీర్‌ మూడు రోజులపాటు ఆమెపై అత్యాచారం చేశాడు. ఎదురుతిరిగిన యువతి తల్లిని కొట్టాడు. అతనికి భయపడి ఇంట్లోనే కుమిలిపోతున్న బాధితురాలు స్థానికులిచ్చిన మనోధైర్యంతో గురువారం రాత్రి డీసీపీకి ఫిర్యాదుచేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు పరారీలో ఉండటంతో..శుక్రవారం అతని బావను స్టేషన్‌కు తీసుకువచ్చారు.

విషయం తెలుసుకున్న అమీర్‌ ఫూటుగా మద్యం తాగి స్టేషన్‌కు వచ్చాడు. ఓ చేతిలో బ్లేడు పట్టుకుని ఠాణా ఎదుటే మద్యం తాగుతూ పోలీసులను దుర్భాషలాడాడు. బ్లేడుతో చేయి కోసుకున్నాడు. అరెస్టు చేస్తే గొంతు కోసుకుంటానని బెదిరిస్తూ..మూడు గంటలపాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావుతోపాటు..మరో ఏసీపీ, నలుగురు ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎట్టకేలకు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించామని, నిందితునిపై అత్యాచారం, ఆత్మహత్యాయత్నం తదితర కేసులు నమోదుచేశామని ఏసీపీ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories