బిగ్‌బాస్ ఇంట్లోకి అందరూ.. కానీ అతనొక్కడే..

Submitted by nanireddy on Sun, 09/30/2018 - 07:32
housemates-reunion-in-the-house

మొదట్లో 16 మంది బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశం చేశారు. కానీ ఒక్కొక్కరు ఒక కారణంతో అదే ఇంటినుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత పలు ఇంటర్వ్యూలలో  ఆ ఇంటితో, తోటి కంటెస్టెంట్లతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాజాగా మరోసారి సభ్యులందరు తమ అనుబంధాన్ని నెమరు వేసుకోవడానికి బిగ్ బాస్ వారందరినీ ఆహ్వానించారు. కంటెస్టెంట్లందరూ వచ్చి హౌస్‌లో సందడి చేశారు. వారంతా వచ్చారు. ప్రస్తుతం ఉన్న ఐదుగురికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇంకేముంది కొన్ని రోజులేనంటూ వారికీ దైర్యం చెప్పారు.  కానీ మరో మాజీ కంటెస్టెంట్ నూతన్ నాయుడుని బిగ్ బాస్ ఆహ్వానించకపోవడం విశేషం. రీ ఎంట్రీ ద్వారా ఒకసారి బయటకు వెళ్లి వచ్చిన నూతన్ నాయుడు మరోసారి గేమ్‌లో చిన్న గాయం కారణంగా కూడా బయటకు వెళ్ల వలసి వచ్చింది. ఈ క్రమంలో అతడు బయటి విషయాలను హౌస్ సభ్యులకు వివరించాడు. దాంతో కారణంతోనే బిగ్‌బాస్ అతడిని పిలిచి ఉండకపోవచ్చనేది పలువురి అభిప్రాయం.  బిగ్ బాస్ పిలవనందుకు కాదు గానీ తన ఆవేదనను బిగ్ బాస్‌కి విన్నవించుకుంటూ ఓ లెటర్ రాశాడు నూతన్ నాయుడు. తన ఎలిమినేషన్ ప్రజా తీర్పుకి అనుగుణంగా జరగలేదని, అలా జరగడం తనను నిరాశకు గురిచేసిందని అందులో పేర్కొన్నాడు. 

English Title
housemates-reunion-in-the-house

MORE FROM AUTHOR

RELATED ARTICLES