రేవంత్ రెడ్డి అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం

Submitted by chandram on Tue, 12/04/2018 - 15:23
high court

రేవంత్‌రెడ్డి ఆచూకీపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటీషన్‌పై హైకోర్టులో విచారణ మొదలైంది. రేవంత్‌రెడ్డిని ఏ ఆధారాలతో అరెస్ట్‌ చేశారో చెప్పాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించారు. రేవంత్‌ వల్ల అల్లర్లు జరిగే అవకాశం ఉందంటూ ఇంటలీజెన్స్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగానే అరెస్ట్ చేసినట్లు.. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ధర్మాసనానికి తెలిపారు. దీంతో ఇంటెలిజెన్స్‌ నివేదికను తమకు సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అలాగే రేవంత్‌రెడ్డి ఎక్కడున్నాడో కూడా తమకు తెలపాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీకి కూడా న్యాయమూర్తి ఆదేశించారు. 

అయితే 10 నిముషాల తర్వాత రెండోసారి వాదనలు మొదలయ్యాయి. రేవంత్‌రెడ్డి అరెస్ట్‌కు సంబంధించిన ఇంటెలిజెన్స్‌ నివేదికను సమర్పించకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్నా వివరాలు సమర్పించడానికి అడ్డంకులు ఏంటని ప్రశ్నించింది. అయితే అరెస్ట్‌కు సంబంధించిన వివరాలు రేపు సమర్పిస్తామని సాయంత్రం 4 గంటలా 30 నిముషాలకు రేవంత్‌ను విడుదల చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. దీనిపై స్పందించిన ధర్మాసనం విచారణకు అడ్వకేట్‌ జనరల్‌ హాజరుకావాలని తదుపరి విచారణను 4 గంటలా 30 నిముషాలకు వాయిదా వేసింది. 

English Title
high court's serious on Revanth Reddy arrest

MORE FROM AUTHOR

RELATED ARTICLES