వరలక్ష్మి గురించి మనసులో మాట చెప్పిన విశాల్!

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 11:43
hero vishal talk about his friend varalakshmi

నిర్మాత, నటుడు, నడిగర్ సంగం ప్రధాన కార్యదర్శిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు తెలుగు బిడ్డ హీరో విశాల్ రెడ్డి. ఇటీవల విడుదలైన 'ఇరుంబుతిరై' నిర్మాతగా, నటుడిగా విశాల్ ను మరో మెట్టు ఎక్కించింది. ఇక విశాల్‌, వరలక్ష్మి మధ్య ప్రేమ.. పెళ్లి అంటూ చాలా రకాల వార్తలు హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా కొన్నిరోజులనుంచి విశాల్, వరలక్ష్మి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. అవ్వన్నీ ఎలా ఉన్నా.. చంద్రమౌళి సినిమా ఆడియో వేడుక సందర్బంగా విశాల్ వరలక్ష్మి ఇరువురు పక్కపక్కనే కూర్చొని ప్రేమగా ముచ్చటించుకోవడం పలువురిని ఆనందంలో ముంచెత్తింది. ఇక ఈ వ్యవహారంపై విశాల్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  వరలక్ష్మి పై తనకున్న ప్రేమ ఏపాటిదో చెప్పేసాడు.

 'నా జీవితంలో స్నేహితులకు ముఖ్య భాగం ఉంటుంది. మనలోని కొరతలను చెప్పేది వారే. అలా నాకు లభించిన పెద్ద భాండాగారం మిత్రులే. అలా  వరలక్ష్మీ కూడా నాకు దక్కిన భాండాగారమే. తను నాకు 8 ఏళ్ల నుంచే తెలుసు. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. వరలక్ష్మీ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాను.' అంటూ వ్యాఖ్యానించాడు. మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారని ప్రశ్న వేయగా సమాధానం దాటవేశాడు విశాల్. దీంతో విశాల్ ఇచ్చిన వివరణతో వారిమధ్య  ప్రస్తుతానికి స్నేహం మాత్రమే ఉందని చాచించుకుంటున్నారు. 

English Title
hero vishal talk about his friend varalakshmi

MORE FROM AUTHOR

RELATED ARTICLES