భూలోకంలో నాగలోకం.. కోట్లకొద్ది పాములు ఎక్కడంటే!

భూలోకంలో నాగలోకం.. కోట్లకొద్ది పాములు ఎక్కడంటే!
x
Highlights

సాధారణంగానే పాములు అంటే అందరికి భయమే సడన్ గా పాము కనిపిస్తే అరకిలోమీటరు దూరం పరుగెడతాం.. అలాంటిది ఒకేచోట కోట్లాది పాములు దర్శనమిస్తే ఇంకేముంది గుండె...

సాధారణంగానే పాములు అంటే అందరికి భయమే సడన్ గా పాము కనిపిస్తే అరకిలోమీటరు దూరం పరుగెడతాం.. అలాంటిది ఒకేచోట కోట్లాది పాములు దర్శనమిస్తే ఇంకేముంది గుండె ఆగిపోవడం ఖాయం. ఆ సర్పాలు కూడా సాధారణవి కాదు ఒక్కసారి కాటేస్తే పైకి పోవడం మినహా మరో దారి లేదు. ఇంతకీ ఏంటా పాముల కథ అనుకుంటున్నారా? బ్రెజిల్ లోని ఇల క్విముడే గ్రాండే దీవి పాములకు నిలయంగా మారింది.అత్యంతవిషపూరితమైన విషసర్పం 'గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్' ఈ దీవిలోని మనుగడ సాగిస్తోంది. ఇక్కడ ప్రతి మూడడుగులకు వేల సంఖ్యలో పాములు దర్శనమిస్తాయి. పాములు తప్ప మిగతా జంతువులు ఏవి లేని దీవి ఏదైనా ఉందంటే అది ఇదేనని చెప్పాలి ఏవో సాధారణ కీటకాలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. సముద్రానికి అంచున ఉన్న ఈ దీవిలోకి హానికరమైన జంతువులు రావు దానికి కారణం ఈ పాములే.. శతాబ్దాలనుంచి ఇక్కడ పాములే జీవిస్తున్నాయి. వేల సంవత్సరాల కిందట ఈ దీవి ఎత్తైన నేలను కలిగి ఉంది కానీ క్రమంగా సముద్రం అంచు పెరిగిపోవడంతో చుట్టూ ఉన్న నేలంతా సముద్రంలో కలిసి ఎత్తైన కొండ ప్రాంతం మాత్రమే మిగిలింది.. దాంతో అది కాస్త దీవిగా మారింది. ఇతర జంతువులు నివసించడానికి వీలులేకపోవడంతో కోట్లాది పాములతో నిండిన ఈ దీవి అచ్చం నాగలోకాన్ని తలపిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories