తెలుగు రాష్ట్రాలకు జలకళ.. నిండుకుండలా ప్రాజెక్టులు..

తెలుగు రాష్ట్రాలకు జలకళ.. నిండుకుండలా ప్రాజెక్టులు..
x
Highlights

తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాలలో పలు ప్రాంతాలలో జోరుగా వానలు...

తెలుగు రాష్ట్రాలను వానలు ముంచెత్తుతుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగురాష్ట్రాలలో పలు ప్రాంతాలలో జోరుగా వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గోదావరి, కృషా నదులకు ఎగువ నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. కర్ణాటకలోని ఆలమట్టి ప్రాజెక్టు నుండి నారాయణ పూర్‌కు లక్షా 77వేల క్యూసెక్కులు వరదనీరు ప్రవహిస్తోంది.ఈ క్రమంలో నారాయణపూర్ నుంచి జూరాలకు లక్షా 58వేల క్యూసెక్కుల నీటీని విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో జూరాల నుంచి లక్షా 50వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు శ్రీశైలం డ్యామ్ కు చేరే అవకాశముంది. ఇక గతకొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు చేరింది.. దీంతో 64వేల 797 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories