ఉద‌యం గోరు వెచ్చ‌ని నిమ్మ ర‌సం తాగ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు

Submitted by lakshman on Tue, 02/20/2018 - 08:06
Drinking Warm Lemon Water

చాలామంది ఉదయాన్నె ఒక హాట్ కప్ కాఫీ లేదా గరం గరం చాయ్ తో మొదలుపెడతారు. కాఫీ, లేదా టీ నిద్ర మత్తును వదిలించి ఆక్టివ్ గ చేయడం లో సఫాలికృతం అవుతాయి, సందేహం లేదు, కాని ఆరోగ్య పరంగా ఇంతకంటే మంచి డ్రింక్స్ ఉన్నాయి. ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాల ప్రయోజనాలున్నాయి. అవేమిటో చూద్దాం.
 నాచురల్ డిటాక్స్
నిమ్మ లో ఉండే అల్కలైన్ లక్షణాలు దీన్ని మంచి శరీరం లోని టాక్సిక్ లను నిర్మూలించే సాధనంగా చేస్తాయి. నిమ్మ అసిడిక్ గ అనిపించినప్పటికీ దీంట్లోని మంచి గుణాలు శరీరం లో pH విలువలను సమతుల్యం చేయడం లో  చాల ఉపయోగపడుతుంది.
  మెరుగైన జీర్ణక్రియ
వేడి నిమ్మ రసం కాలి కడుపున త్రాగడం వలన గాస్ట్రో  సిస్టం మెరుగు పడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి పెరుగుతుంది. తద్వారా, ఓవర్ అల్ హెల్త్ మెరుగు పడడం తో పాటుగ, వ్యాదులకు దూరంగా ఉండవచ్చు కూడా.
బరువు తగ్గడం
నిమ్మకాయ లో ఉండే పెక్టిన్ అణే ఓక ప్రత్యెక ఫైబర్ పదార్థం వలన ఇది బరువు తగ్గలనుకునే వారికి ఒక దివ్య ఔషదం లాంటిదే. దీంతో మెటబాలిజం కూడా మెరుగు పడి ఆకలి నియంత్రణ కు దారి తీస్తుంది.
అలజడి లేని పొట్ట
పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన కడుపు కాలి అయి ప్రశాంతత ను సమకూరుస్తుంది.  ముందు రోజు మసాలాలు, జంక్ టిని ఉంటె అవ్వన్నీ క్లీన్ అయి కడుపు ఉబ్బటం, అలజడి, అల్సర్లు లాంటివి రాకుండా చేయడం లో కూడా నిమ్మ దానికి అదే సాటి.

English Title
Health Benefits Of Drinking Warm Lemon Water

MORE FROM AUTHOR

RELATED ARTICLES