‘సీఎం సీటులో రేవంత్‌ కూడా ఉండొచ్చు’...కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ షాకింగ్ కామెంట్లు!

‘సీఎం సీటులో రేవంత్‌ కూడా ఉండొచ్చు’...కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ షాకింగ్ కామెంట్లు!
x
Highlights

సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌...

సింహాన్ని బోనులో బంధించి అడవిలో తిరగడం గొప్ప కాదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని కొడంగల్‌లోని ఆయన నివాసంలో ఆజాద్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డిని బయటకు వదిలి కేసీఆర్‌ కొడంగల్‌కు రావాలని సవాలు చేశారు. రేవంత్‌ను అరెస్ట్‌ చేసి ఇక్కడికి రావడం ప్రజాస్వామ్యమా? అని ప్రశ్నించారు. అధికారం అన్నది ఎన్నటికీ శాశ్వతం కాదనీ, ఈ రోజు సీఎం కుర్చీపై కేసీఆర్ ఉన్నారనీ.. రేపు అదే కుర్చీపై రేవంత్ రెడ్డి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. రేవంత్ సీఎం అవ్వొచ్చు అని ఆజాద్ చెప్పగానే కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. కాగా, ఆజాద్ వ్యాఖ్యలతో టీకాంగ్రెస్ లో కలకలం చెలరేగింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి సీఎం రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి సహా పలువురు నేతలు ఉన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ మహాకూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories