భర్తను చంపించిన సరస్వతి కేసులో విస్తుపోయే వాస్తవం..

Submitted by nanireddy on Mon, 05/14/2018 - 10:41
fresh-update-attack-newly-married-couple-vizianagaram-case

పెళ్ళైన పదిహేను రోజులకే కట్టుకున్న భర్తను ప్రియుడి చేత దారుణంగా హత్య చేయించిన విజయనగరం జిల్లాకు చెందిన సరస్వతి కేసులో  మరో విస్తుపోయే వాస్తవం వెలుగులోకి వచ్చింది. భర్తను చంపించడం కోసం మొదటగా బెంగుళూరు కు చెందిన కిరాయి గుండాలతో బేరం కుదిర్చింది సరస్వతి. అయితే వారు అడ్వాన్స్ డబ్బు తీసుకున్న తరువాత  ఫోన్‌ ఎత్తకపోవడంతో, విజయనగరానికి చెందిన మరో ముఠాతో ఒప్పందం చేసుకుని శివతో కలిసి సరస్వతి ఆమె భర్త గౌరీ శంకర్‌ను హత్య చేయించి.. దీన్ని దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించారు. భర్తను హత్య చేయించే తతంగాన్ని ప్రియుడు శివకు అప్పజెసిప్పింది సరస్వతి అందుకోసం భర్త ఏటీఎం కార్డు లోనుంచి రూ. 25 వేల రూపాయలు ఆన్‌లైన్‌ నగదు చెల్లింపు యాప్‌ ద్వారా హంతకుల ముఠాకు శివ పంపినట్టు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.  

English Title
fresh-update-attack-newly-married-couple-vizianagaram-case

MORE FROM AUTHOR

RELATED ARTICLES