ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలది కీలక పాత్ర...పలు సందర్భాల్లో నాలుగు రకాల ఓట్లు వేసేందుకు అనుమతి

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలది కీలక పాత్ర...పలు సందర్భాల్లో నాలుగు రకాల ఓట్లు వేసేందుకు అనుమతి
x
Highlights

భారత దేశంలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నిలు కీలక పాత్ర పోషిస్తాయి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క భారతీయుడూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు, ఓటు వేయొచ్చు...

భారత దేశంలాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నిలు కీలక పాత్ర పోషిస్తాయి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క భారతీయుడూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చు, ఓటు వేయొచ్చు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు ఇక ఓటరు తన హక్కును సంపూర్ణంగా వినియోగించుకునేందుకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది.

ఎన్నికల్లో పోలింగ్ బూత్‌లో వేసే ఓట్లే కాకుండా మరికొన్ని రకాల ఓట్లు కూడా ఉన్నాయి వీటిలో కొన్ని లెక్కింపుకి పరిగణలోకి తీసుకోరు అయినా వేటికవే ప్రత్యేకత కలిగిన ముఖ్యపాత్రను పోషిస్తుంటాయి ఎన్నికల విధులు, రక్షణ దళాల్లో పనిచేసే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేస్తారని తెలుసు ఇంతే కాకుండా నమూనా ఓట్లు, టెండర్ల ఓట్లు, ఛాలెంజ్ ఓట్లు, టెస్టు ఓట్లు గురించి ఎక్కువ మందికి తెలియక పోవచ్చు.

నమూనా ఓటు అంటే ఓటింగ్ యంత్రం తనిఖీ కోసం పోలింగ్ మొదలు కావడానికి గంట ముందు పోలింగ్ ఏజెంట్లు 50ఓట్ల వరకూ వేస్తారు. నమూనా ఓట్లుకు వచ్చిన స్లింప్పులను భద్రపరిచి ఈవీఎం మిషన్ల నుంచి ఓట్లను తొలగిస్తారు ఇలా చేసిన అనంతరం అసలైన పోలింగ్ మొదలైతుంది ఇక ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి ఓటరు వెళ్లేసరికి ఎవరైనా తన ఓటును వేసినట్లు అయితే నిజమైన ఓటర్ అని అధికారులు నిర్ధారిస్తే సదరు వ్యక్తి టెండర్ ఓటు వేయొచ్చు అయితే అతడు ఈవీఎంలో ఓటు వేయడానికి మాత్రం అధికారులు అనుమతించరు కేవలం బ్యాలెట్ ప్రతం ద్వారా మాత్రమే ఓటు వేయాలి ఇలా వేసిన ఓటును ప్రత్యేక కవర్ లో భద్రపరిచి అభ్యర్థుల మధ్య ఓట్లు సమానంగా వచ్చినప్పుడు మాత్రమే వీటిని పరిగణలోకి తీసుకుంటారు.

వీటితో పాటు ఛాలెంజ్ ఓట్లు కూడా ఉంటాయి ఓటర్ పోలింగ్ కేంద్రానికి వెళ్లినత తర్వాత అసలు అతను ఓటరే కాదని పోలింగ్ ఏజెంట్ నుంచి సవాల్ వస్తే ఆ సమయంలో ఛాలెంజ్ ఓటుకు అనుమతిస్తారు అనంతరం ఓటర్, ఏజెంట్ల వాదనలు పోలింగ్ ఆఫీసర్ విని అక్కడికి వచ్చిన ఇతర ఓటర్ల నుంచి వివరాలు తెలుసుకొని నిజమైన నిర్ధారణమైతే ఓటు వేసేందుకు అనుమతిస్తారు నిర్ధారణ కాకపోతే ఓటర్ ను పోలీసులకు అప్పగిస్తారు.

ఇక టెస్ట్ ఓట్లు అంటే ఓటు వేసిన తర్వాత వీవీప్యాట్‌లో కనిపించే పేపర్ స్లిప్ వివరాలు సక్రమంగా లేదని తాను ఓటు వేసిన అభ్యర్థికి ఓటు పడలేదని ఓటరు అనుమానం వ్యక్తం చేస్తే అధికారుల అతనితో మాట్లాడి ఒటింగ్ ను నిలిపివేయ వచ్చు అయితే ఓటరు ముందు తప్పు చూపిస్తోందని ఫిర్యాదు చేయాలి అనంతరం ప్రిసైడింగ్ అధికారి అతనితో మాట్లాడి తప్పుడు అభియోగం అయితే దారితీసే పరిణామాల గురించి హెచ్చరించి అతని నుంచి లిఖిత పూర్వక ఆమోదం తీసుకుంటారు అ తర్వాత పోలింగ్ ఏజెంటు సమక్షంలో మిషన్‌లో టెస్ట్ ఓటును నమోదు చేసేందుకు అనుమతిస్తారు ఓటరు చెప్పినట్లు వీవీ ప్యాడ్‌లో తప్పుడు ప్రచారం చూపిస్తే ఎన్నిక నిలిపివేస్తారు అతని అభియోగం తప్పైతే ఓటర్‌ను పోలీసులకు అప్పగిస్తారు. మొత్తానికి ఇలా నాలుగు రకాలైన ఓట్లు ఉంటాయని ఎన్నికల సంఘం ఓటర్లను సూచిస్తోంది అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడు ప్రాబ్లమ్ వస్తే ఈ విధంగా పరిష్కరించుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories