నాలుగు రాష్ట్రాల సీఎంలకు డూ ఆర్ డై

నాలుగు రాష్ట్రాల సీఎంలకు డూ ఆర్ డై
x
Highlights

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు...సన్నాహకంగా జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అధికార బీజెపెీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే...

వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికలకు...సన్నాహకంగా జరుగుతున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు అధికార బీజెపెీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలకు మాత్రమే కాదు....నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సత్తాకు సవాలు విసురుతున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో బీజెపీ,.... మిజోరంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మరోసారి అధికారమే లక్ష్యంగా సమరానికి సిద్ధమయ్యారు. 2019 లోక్ సభ ఎన్నికలకు...సెమీఫైనల్స్ గా భావిస్తున్న...పశ్చిమ, మధ్య, ఈశాన్య రాష్ట్రాలలోని... నాలుగు రాష్ట్రాల ఎన్నికలు...ప్రధాన, ప్రతిపక్ష ప్రధాననేతల ప్రచారంతో జోరందుకొంది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజెపీ, ఈశాన్య రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్..అధికార పార్టీలుగా ఉన్నాయి. మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో పావులు కదుపుతున్నాయి. అధికారం నిలుపుకోడానికి ీకమలనాథులు....అధికారం చేజిక్కించుకోడానికి హస్తం పార్టీ వీరులు...సవాల్ అంటే సవాల్ అంటున్నారు. మధ్యభారత రాష్ట్రం మధ్యప్రదేశ్ లో బీజెపీ గత మూడుదఫాలుగా అధికారం నిలుపుకొంటూ వస్తే...ఛత్తీస్ గఢ్ లో రమణ్ సింగ్ మరోసారి అధికారం తనదేనన్న ధీమాతో ఉన్నారు. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో సైతం బీజెపీ పార్టీనే అధికారం నిలుపుకోడానికి నానాపాట్లు పడుతోంది. ఇక ఈశాన్య భారత్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో పరిస్థితి అంచనాలకు అందనిరీతిలో సాగుతోంది.

రాజస్థాన్ లో తమకు ఎదురుగాలి వీస్తున్నా....మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో పరిస్థితి అంత ఆశావహంగా లేకున్నా...అధికార బీజెపీ..మరోసారి గెలుపుతమదేనన్న ఆత్మవిశ్వాసంతో ఉంది. మిజోరంలో సైతం అధికార కాంగ్రెస్ మరోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఇప్పటికే అభ్యర్ధులను ప్రకటించి...ఎన్నికల ప్రచారం మొదలు పెట్టింది. పొరుగుదేశం పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం రాజస్థాన్ లో... అధికార బీజెపీకి పరిస్థితి అంతఅనువుగా లేదని...ముఖ్యమంత్రి వసుంధర రాజే కు గడ్డుపరీక్ష తప్పదని సర్వేలు మాత్రమే కాదు... రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మరోవైపు ఎడారి రాష్ట్రంలో ఈసారి అధికారం తమదేనన్న ధీమా..హస్తంపార్టీలో కనిపిస్తోంది.

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకంగా నిలిచే మనదేశంలోని వివిధ రాష్ట్రాలలో జరిగేఎన్నికల్లో... విలక్షణ తీర్పు ఇవ్వడంలో రాజస్థాన్ తర్వాతే ఏదైనా. 1998 నుంచి ఐదేళ్ల కోసారి అధికారం మార్చుకొంటూ వస్తున్న రాజస్థాన్ ప్రజలు...ఈసారి అధికార బీజెపీని కాదని...ప్రతిపక్ష కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు...ఎన్నికల సర్వేలు సైతం...ప్రతిపక్ష కాంగ్రెస్ కే పరిస్థితి అనుకూలంగా ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నాయి. దీనికితోడు రాజస్థాన్ ప్రస్తుత ముఖ్యమంత్రి వసుంధర రాజే... గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories