కొడుకు ఫెయిల్ అయ్యాడు.. తండ్రి పండగ చేశాడు!

Submitted by nanireddy on Thu, 05/17/2018 - 11:13
father-celebrates-son-s-failure-in-mp-board-10th-result

 ఏ తండ్రైన తన కొడుకు ఫెయిల్ అయితే ఏమి చేస్తాడు.. నాలుగు తిట్లు తిడతాడు మహా అయితే కొడతాడు.. కానీ విచిత్రంగా ఓ తండ్రి  కొడుకు ఫెయిల్ అయ్యాడని స్వీట్లు పంచి, క్రాకర్లు కాల్చి పండగ చేశాడు. ఇదేమైనా  రవితేజ 'కిక్' సినిమా అని ఆశ్చర్యబోతున్నారా..? ఇది అక్షరాలా నిజం.. బుధవారం మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ లో ఈ ఘటన జరిగింది.  భోపాల్ కు చెందిన సురేంద్ర వ్యాస్ కు కుమారుడు అయుష్ వ్యాస్ ఉన్నాడు. అయుష్ వ్యాస్ 2018 పదవతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయం కుటుంబసభ్యులకు చెప్పాడు అయుష్.. దీంతో  వెంటనే బజారుకెళ్ళిన సురేంద్ర వ్యాస్.. టెంట్, స్వీట్స్ , కాల్చడానికి క్రాకర్లు తెచ్చాడు.  ఇంటివద్ద టెంటు వేసి పలువురికి స్వీట్స్ పంచుతూ క్రాకర్లు కాల్చాడు.. అంతేకాకుండా కుమారుడిని కూడా కాల్చమని క్రాకర్లు ఇవ్వడంతో చుట్టుపక్కల జనం విస్తుపోయారు. ఇదేంటని  సురేంద్రను ప్రశ్నించారు దానికి అతను బదులిస్తూ'పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారు. పైగా  ఆత్మహత్యలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థులందరికీ నేను చెప్పదలచేదేంటంటే బోర్డు పరీక్షలే అంతిమం కాదు. ఇలాంటివి జీవితంలో ఎన్నో వస్తాయి వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి' అని తన కుమారుడు ఫెయిల్ అవ్వడం తనకు పిచ్చ కిక్ ఇచ్చిందని చెప్పాడు. దాంతో ఈ దృశ్యాలు కాస్త సోషల్ మీడియాలో రావడంతో పలువురు అతన్ని అభినందిస్తున్నారు. 

English Title
father-celebrates-son-s-failure-in-mp-board-10th-result

MORE FROM AUTHOR

RELATED ARTICLES