శ్రీరాం సాగర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలి.. రైతుల ఆందోళన

శ్రీరాం సాగర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలి.. రైతుల ఆందోళన
x
Highlights

శ్రీరాం సాగర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలంటూ పోరు ఉద్రిక్తతకు దారి తీసింది. సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతులు..ప్రాజెక్ట్ ఎస్ఈ కార్యాలయాన్ని...

శ్రీరాం సాగర్ ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయాలంటూ పోరు ఉద్రిక్తతకు దారి తీసింది. సాగు నీటి కోసం రోడ్డెక్కిన రైతులు..ప్రాజెక్ట్ ఎస్ఈ కార్యాలయాన్ని ముట్టడించారు. లక్ష్మీ, కాకతీయ కాలువల ద్వారా నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎస్ ఈ ఆఫీస్ లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఆ తర్వత రోడ్డుపై రాస్తారోకో నిర్వహించిన రైతులు.. మిషన్ భగీరథ కోసం వేసుకున్న పంటలకు నీరు ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయకట్టు పరిధిలో లక్ష్మీ లిఫ్టు ద్వారా నీరు విడుదల చేసేందుకు అవకాశాలున్నా.. నీటిని వదలట్లేదన్నారు. రోడ్డుపై పెద్ద సంఖ్యలో రైతులు బైఠాయించటంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మరోవైపు రోడ్లపై వచ్చే వాహనాలపై రాళ్ళ దాడి చేశారు. రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు రైతులు.

Show Full Article
Print Article
Next Story
More Stories