వెబ్‌సైట్ వేదికగా జ్యోతిష్య మోసం...

వెబ్‌సైట్ వేదికగా జ్యోతిష్య మోసం...
x
Highlights

అతడో యువకుడు. ఎనిమిదో తరగతి చదువుకున్నాడు. నకిలీ జ్యోతిష్యుడి అవతారం ఎత్తాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 8 వెబ్ సైట్ లు ఏర్పాటు చేశాడు. మీ ఎలాంటి...

అతడో యువకుడు. ఎనిమిదో తరగతి చదువుకున్నాడు. నకిలీ జ్యోతిష్యుడి అవతారం ఎత్తాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 8 వెబ్ సైట్ లు ఏర్పాటు చేశాడు. మీ ఎలాంటి సమస్యలైనా తీరుస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో నకిలీ జ్యోతిష్యుడి గుట్టు రట్టైంది.

ఈ యువకుడి పేరు ఆకాశ్. పంజాబ్ లోని జలంధర్ కు చెందిన ఇతడు ఎనిమిదో తరగతి చదివాడు. నకిలీ జ్యోతిష్యుడి అవతారం ఎత్తి అస్ట్రాలజీ పేరుతో 8 వెబ్ సైట్ లు క్రియోట్ చేశాడు. జ్యోతిష్యంతో ఎలాంటి సమస్యనైనా ఆన్ లైన్ లో లైవ్ పూజతో పరిష్కరిస్తానని ఆకాశ్ అమాయకులను చీటింగ్ చేస్తున్నాడు. హైదరాబాద్ రామంతాపూర్ కు చెందిన ఓ మహిళ కుమారుడైనా శ్రీకర్ణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మీ కొడుకు రోగం పూజలతో నయం చేస్తానని ఆకాశ్ మాయమాటలు చెప్పి 13 లక్షలు మోసం చేశాడు.

ఆకాశ్ అసలు రూపం బయటపడడంతో బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ట్రాన్సెట్ వారెంట్ పై జలంధర్ నుంచి ఆకాశ్ ను హైదరాబాద్ కు తీసుకువచ్చారు పోలీసులు. అస్ట్రాలజీ పేరుతో ఆకాశ్ అన్ని మతాల వారికి చెందిన పలువురిని మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఆకాశ్ పై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నకిలీ జ్యోతిష్యుల పట్ల అలర్ట్ గా ఉండాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories