పేస్ బుక్ వినియోగదారులకు శుభవార్త.. అందుబాటులోకి కొత్త ఫీచర్

పేస్ బుక్ వినియోగదారులకు శుభవార్త.. అందుబాటులోకి కొత్త ఫీచర్
x
Highlights

ఇప్పటికే వినియోగదారుల సమాచారం చోరీ ఆరోపణలతో సతమతమవుతున్న పేస్ బుక్ ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పేస్...

ఇప్పటికే వినియోగదారుల సమాచారం చోరీ ఆరోపణలతో సతమతమవుతున్న పేస్ బుక్ ఇకపై అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. పేస్ బుక్ నిపుణులతో చర్చలు ప్రారంభించిన పేస్ బుక్ వ్యవస్థాకుడు మార్క్ జుకర్ బెర్గ్ నేతృత్వంలో ఓ చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. పేస్ బుక్ వినియోగదారుల సమాచారాన్ని లీక్ అవ్వకుండా చూసుకునేందుకు ఓ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు మార్క్ జుకర్ బెర్గ్ తెలిపారు. పేస్ బుక్ లో చూసిన వెబ్ సైట్లు, యాప్స్ సమాచారాన్ని అకౌంట్ నుంచి డిలీట్ చేసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందన్నారు. బ్రౌజర్ లో కుకీస్ క్లియర్ కూడా చేసుకోవచ్చని చెప్పారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు జుకర్ బెర్గ్ తెలియజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories