అభ్యర్ధుల్లో టెన్షన్‌ పెంచుతున్న సర్వేలు

x
Highlights

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కాసేపటికే వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ టెన్షన్‌ను పెంచాయి. జాతీయ సర్వేలకు పూర్తి భిన్నంగా ఉన్న...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన కాసేపటికే వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ టెన్షన్‌ను పెంచాయి. జాతీయ సర్వేలకు పూర్తి భిన్నంగా ఉన్న లగడపాటి రాజగోపాల్ సర్వే రాజకీయ పార్టీలను, అభ్యర్ధులను టెన్సన్‌లోకి నెట్టేశాయి.

తెలంగాణలో ఎన్నికల సమరం ముగిసింది. మరో రెండు రోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఓటరు తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. వివిధ సంస్థలు చేపట్టిన సర్వేలు అభ్యర్ధుల్లో టెన్షన్‌ను మరింత పెంచుతున్నాయి. పలు జాతీయ న్యూస్ ఛానెల్స్ చేపట్టిన సర్వేలు టిఆర్‌ఎస్‌ వైపే ఓటర్లు మొగ్గుచూపారని చెబుతుంటే మరి కొన్ని జాతీయ సర్వేలు వార్ వన్‌ సైడ్ కాదని స్పష్టం చేస్తున్నాయి. టిఆర్‌ఎస్‌కు మహాకూటమికి మధ్య హోరాహోరీ తప్పదని తేల్చాయి.

ఈ సారి ఎన్నికల్లో ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయి ? ఎవరికి ప్రతికూలంగా మారతాయనే విషయమై లగడపాటి చేపట్టిన సర్వేకు విశేష ప్రాచుర్యం లభించింది. లగడనాటి విశ్లేషణాత్మక వివరణ అభ్యర్ధుల్లో టెన్షన్‌ను పెంచింది. తెలంగాణ ఓటరు నాడి పట్టడంలో జాతీయ సంస్థలు విజయం సాధించాయా ? లగడపాటి విజయం సాధించారా అనే విషయం మరో రెండు రోజుల్లో తేలనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన తీర్పే అసలైన తీర్పు. డిసెంబర్ 11న అసలైన పీపుల్స్ జడ్జిమెంట్ వెల్లడికానుంది. అప్పటి వరకు పార్టీలకు, అభ్యర్ధులకు టెన్షన్ తప్పనిసరి.

Show Full Article
Print Article
Next Story
More Stories