జమ్మూ కశ్మీర్‌లో మళ్ళీ అలజడి..

జమ్మూ కశ్మీర్‌లో మళ్ళీ అలజడి..
x
Highlights

కశ్మీర్‌లో బక్రీద్ పండగ సందర్భంగా ప్రార్థనల అనంతరం కొందరు రోడ్లపైకొచ్చి పాకిస్తాన్ జెండాలను ఊపుతూ హడావిడి చేశారు. కొందరు ఐసిస్ జెండాలను చేతపట్టుకుని...

కశ్మీర్‌లో బక్రీద్ పండగ సందర్భంగా ప్రార్థనల అనంతరం కొందరు రోడ్లపైకొచ్చి పాకిస్తాన్ జెండాలను ఊపుతూ హడావిడి చేశారు. కొందరు ఐసిస్ జెండాలను చేతపట్టుకుని పరుగులు తీశారు. కనిపించిన వారిపైకి రాళ్లు రువ్వారు. ఇక ఈ ఘటన మరవకముందే.. జమ్ముకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలకు, టెర్రరిస్ట్‌లకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కోకేర్‌నాగ్‌లోని గరోల్ ప్రాంతంలోని ఓ భవనంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమచారం అందుకున్న భద్రతా బలగాలు తెల్లవారుజామునే జవాన్లు కార్డన్ సెర్చ్ చేపట్టారు. దీంతో జవాన్లను సెర్చ్ ను పసిగట్టిన టెర్రరిస్ట్‌లు కాల్పులు జరపడంతో.. జవాన్లు కూడా ఫైరింగ్ మొదలుపెట్టారు. ఈ కాల్పుల్లో ఓ టెర్రరిస్ట్‌ను మట్టుపెట్టారు. భారీగా ఆయుధాల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆపరేషన్ కొనసాగుతోంది. అటు, అనంత్‌నాగ్‌లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తాత్కాలికంగా మొబైల్ సర్వీసుల్ని నిలిపివేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories