రేవంత్‌రెడ్డిపై ఈసీ సీరియస్..నోటీసులు జారీ

Submitted by chandram on Mon, 12/03/2018 - 10:27


టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సీరియస్‌‌గా తీసుకుంది. కొడంగల్‌లో భయాందోళనలు సృష్టించిన రేవంత్ సీఎం కేసీఆర్‌ సభను అడ్డుకోవడంతో పాటు బంద్‌కు పిలుపునిచ్చి ఆందోళనకు గురిచేశారని ఈసీకి టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసింది. దీంతో రేవంత్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి సీఈఓ ఆదేశాలు జారీచేశారు.టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయింది.  రేవంత్‌ కొడంగల్‌ బంద్‌కు పిలువునివ్వడం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని వ్యాఖ్యానించడంపై టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. రేవంత్‌ ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

ఇందుకు సంబంధించిన వీడియో ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించిన టీఆర్‌ఎస్ నేతలు‌...కొడంగల్‌ ప్రజలను అకారణంగా రెచ్చగొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఈసీ రజత్‌కుమార్ రేవంత్‌రెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. అయితే, తనను అడ్డుకోవడం హరీశ్‌రావు, కేటీఆర్‌ వల్ల సాధ్యం కాకే కేసీఆర్‌ రంగంలోకి దిగారని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కొండారెడ్డిపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన రేవంత్ కేసీఆర్‌ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సీరియస్‌ అయిన ఈసీ రేవంత్‌కు నోటీసులు జారీ చేసింది. కొడంగల్‌లో  రెండు రోజులపాటు 144 సెక్షన్ విధించింది. 

English Title
EC Serious On Revanth Reddy Over Comments On KCR

MORE FROM AUTHOR

RELATED ARTICLES