నా ఫొటో షేర్ చేయకండి ప్లీజ్..!

Submitted by arun on Mon, 07/02/2018 - 17:53
anju

కేరళలో ఇటీవల వెలుగులోకొచ్చిన ఓ కేసుకు, ఓ మహిళకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆమె ఫొటోను ఉపయోగిస్తూ.. ఓ ఫెక్‌ ఆడియో క్లిప్‌ను కొందరు విస్తృతంగా షేర్ చేశారు. చర్చిలో పాస్టర్లు తన భార్యను వేధిస్తున్నారంటూ ఓ భర్త మాట్లాడిన ఆడియో క్లిప్ అది. ఈ ఆడియో క్లిప్‌కు... ఆ మహిళాకు  ఎలాంటి సంబంధం లేనప్పటికీ ఈమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలా షేర్ అవుతూ.. ఆ మహిళ భర్త ఫోన్‌లో కూడా కనిపించింది. అది చూసిన ఆయన అవాక్కయ్యారు. తన భార్యతో విషయం చెప్పగా.. ఆమె కూడా షాక్‌కు గురైంది. ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే గతంలో కూడా ఇలా నాలుగైదు సార్లు తన ఫొటోను దుర్వినియోగం చేశారని.. ఆ మహిళ వాపోయింది. పోర్న్ కంటెంట్‌కు.. తన ఫొటోను జత చేసి ఒకసారి.. అశ్లీల పదజాలంతో కూడిన ఆడియో క్లిప్పింగ్‌కు జతచేసి మరోసారి తన ఫొటోను దుర్వినియోగం చేశారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయిందని ఆ మహిళ పేర్కొంది. ఈసారైనా.. తన ఫొటోను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపింది.

English Title
Dr Anju’s photograph began to circulate on social media

MORE FROM AUTHOR

RELATED ARTICLES