బైరవుడు, ఫైథాన్‌ మధ్య సాగిన భీకర పోరు

బైరవుడు, ఫైథాన్‌ మధ్య సాగిన భీకర పోరు
x
Highlights

ఒక్కోసారి కొమ్ములు తిరిగిన వీరులకైనా ఓటమి తప్పదు. అది మనుషులైనా అడవి జంతువులైనా ఒక్కటే సూత్రం. సర్ప జాతిలోనే డేంజర్‌ లిస్ట్‌లో ఉన్న ఫైథాన్‌ అంటే...

ఒక్కోసారి కొమ్ములు తిరిగిన వీరులకైనా ఓటమి తప్పదు. అది మనుషులైనా అడవి జంతువులైనా ఒక్కటే సూత్రం. సర్ప జాతిలోనే డేంజర్‌ లిస్ట్‌లో ఉన్న ఫైథాన్‌ అంటే ఎవరైనా హడలిపోవాల్సిందే. సైజ్‌లోనే కాదు వెయిట్‌లోను తనకు తానే సాటి అనిపించుకుంటుంది కొండచిలువ. పైగా మనుషులను అమాంతం మింగే ఈ పామును చూస్తేనే జనం వ‌ణుకిపోతారు. అలాంటి భయంకరమైన కొండ చిలువకే పట్టపగలు చుక్కలు చూపించింది శునకం.

అమెరికా లాస్‌ ఏజెంల్స్‌లో ఒంటరిగా తిరుగుతున్న కుక్కను తినేద్దామనుకున్న కొండచిలువ ఆటలు సాగలేదు. పర్సనాలిటిలో తన కన్న చిన్నదని చులకనగా చూసి చుట్టేసింది. ఎలాగైన తినేద్దామని ఆశపడింది. కానీ సీన్ రివర్స్ అయింది. సైజ్‌లో చిన్నదైనా శునకం ఫైథాన్‌తో వీరోచితంగా పోరాడింది. బైరవుడి భీకరపోరుకు పట్టు తప్పి నీటి గుంటలో పడిపోయింది. అయినా కాసేపు రెండింటి మధ్య బిగ్‌ ఫైట్‌ నడిచింది. దీన్ని గమనించిన స్థానికులు కుక్క పిల్లను రక్షించారు. ప్రాణాలతో బయటపడ్డ శునకం అక్కడి నుంచి పరుగులు తీసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories