ఒక్క పోస్ట్ చేస్తే.. 8 లక్షల రూపాయలా?

Submitted by arun on Fri, 03/09/2018 - 15:43
Priya Prakash Varrier

అలా కన్ను కొట్టి.. ఇలా అందరినీ తన బుట్టలో పడేసుకున్న ప్రియా ప్రకాశ్ వారియర్.. సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలిస్తే.. మనం కళ్లు తేలేయడం ఖాయం. ఒరు అడర్ లవ్ సినిమా టీజర్ తో చిన్నా పెద్దా తేడా లేకుండా అందరినీ మాయ చేసి పారేసిన ప్రియా.. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హాట్ కేక్ అయిపోయింది. ఇన్ స్టా గ్రామ్ లో ఆమె సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

అంతర్జాతీయ సెలెబ్రిటీల పక్కన చోటు కూడా సంపాదిస్తోంది. అంతటి పాపులారిటీని ప్రియా చాలా జాగ్రత్తగా క్యాష్ చేసుకుంటోంది. తన సోషల్ మీడియాలో అకౌంట్లలో ఒక పోస్ట్ చేసేందుకు ఆమె ఏకంగా 8 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. కోట్లు గడించే విధానాన్ని తీసుకొచ్చాడు. ఆయన చేసే పోస్టులు.. అభిమానుల ఆదరణ పొందడంలో ముందుటాయి.

ఇప్పుడు ఆయన బాటలోనే.. ప్రియా ప్రకాష్ వారియర్ కూడా చేరిపోయింది. ఇంత చిన్న వయసులోనే.. అంత పెద్ద మొత్తం సంపాదిస్తూ.. టాప్ సెలెబ్రిటీలకూ సవాల్ విసురుతోంది.
 

English Title
Do You Know How Much Priya Prakash Varrier is Earning Per social media post

MORE FROM AUTHOR

RELATED ARTICLES