టీఆర్‌ఎస్‌ ఆరోపణలపై డీఎస్‌ కామెంట్స్‌

టీఆర్‌ఎస్‌ ఆరోపణలపై డీఎస్‌ కామెంట్స్‌
x
Highlights

తనకు వ్యతిరేకంగా నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన తీర్మానాన్ని డీఎస్‌ లైట్‌ తీస్కున్నారు. కేసీఆర్‌కి ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండి అంటూ...

తనకు వ్యతిరేకంగా నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన తీర్మానాన్ని డీఎస్‌ లైట్‌ తీస్కున్నారు. కేసీఆర్‌కి ఫిర్యాదు చేసుకుంటే చేసుకోనివ్వండి అంటూ వ్యాఖ్యానించారు. తనపై ఫిర్యాదే కదా చేస్తానంది... గొంతు కోస్తానని చెప్పలేదు కదా అంటూ కామెంట్‌ చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నా... ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేదన్నారు. తనకు వ్యతిరేకంగా జరుగుతోన్న పరిణామాలపై తానిప్పుడేమీ మాట్లాడబోనన్నారు.

డి.శ్రీనివాస్‌ తన అనుచరులతో అత్యవసర సమావేశమయ్యారు. డీఎస్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు తీర్మానం చేయడంతో తన నివాసంలో అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతల తీర్మానం నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు.

ఇటీవల మున్నూరు కాపు మీటింగ్‌లో పాల్గొన్న డీఎస్‌‌కు కుల సంఘం నేతలు జ్ఞానోదయం కలిగించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయి కలిగిన నేత అయ్యుండి టీఆర్‌ఎస్‌లో ఎందుకు చేరావంటూ కుల సంఘం నేతలు నిలదీశారు. డీఎస్‌ను తాము ఆహ్వానించలేదని, గతిలేకే మా పార్టీలో చేరారంటూ కవిత వ్యాఖ్యానించినట్లు డీఎస్‌‌కి చెప్పడంతో.... డి.శ్రీనివాస్‌ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories