అదనపు కట్నం తెమ్మని భర్త.. కోరిక తీర్చమంటూ మామ.. నవ వధువు ఆత్మహత్య!

Submitted by nanireddy on Wed, 06/13/2018 - 08:29
crimes-in-a-one-day

ఓ వైపు  అదనపు కట్న దాహం.. మరోవైపు మామ వేధింపులకు తాళలేక  నవ వధువు ఆత్మహత్య  చేసుకుంది.  ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో  చోటుచేసుకుంది. జిల్లాకు చెందిన కోమలతకు కరీంనగర్ జిల్లా మానకొండురుకు చెందిన విజయ్‌తో మూడునెలల క్రితం వివాహమైంది.పెళ్లి సమయంలో విజయ్ కి కొంత డబ్బును కట్నంగా ఇచ్చారు కోమలత తల్లిదండ్రులు. అయితే వ్యాపారం చేసుకుందుకు అదనపు కట్నం కావాలని అడిగాడు విజయ్.. ఆమె నిరాకరించింది తన తల్లిదండ్రులు నిరుపేదలని తద్వారా అదనపు కట్నం ఇవ్వలేరని భర్తకు చెప్పింది. దీంతో భార్యపై కోపంగా ఉన్నడు విజయ్. ఇక అప్పటినుంచి ఆమెకు దూరంగా ఉంటున్నాడు.దీనికి తోడు కోరిక తీర్చమంటూ మామ వేధించడంతో.. మనస్థాపం చెందిన ఆ యువతి పుట్టింటికి వెళ్లి ఉరివేసుకుని చనిపోయింది. కోమలత మృతికి కారకులైన భర్త, అత్తమామలపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేశారు.

English Title
crimes-in-a-one-day

MORE FROM AUTHOR

RELATED ARTICLES