ఏపీ మంత్రి పితానికి రెవెన్యూ అధికారుల నోటీసులు

Submitted by arun on Thu, 07/12/2018 - 17:28
Pithani

ఏపీ మంత్రి పితాని సత్యనారాయణకు రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వారంటూ మంత్రి పితానితోపాటు కుటుంబ సభ్యులకు కూడా నోటీసులు ఇఛ్చారు. అలాగే పితాని సొంత గ్రామంలో మరో 83మందికి నోటీసులు జారీ చేశారు. 176 ఎకరాల్లో తవ్విన అక్రమ చెరువులను తొలగించాలని ఆదేశించారు. అక్రమ చెరువులతో పర్యావరణం కలుషితమవుతోందంటూ పిటిషనర్ గుంటూరి రామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. 

English Title
Court Issue Notices To Minister Pithani Satyanarayana and His Family Members

MORE FROM AUTHOR

RELATED ARTICLES