ప్రేమ పెళ్లి చేసుకున్నారని మూత్రం తాగించారు..

ప్రేమ పెళ్లి చేసుకున్నారని మూత్రం తాగించారు..
x
Highlights

ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటకు ఘోర అవమానం ఎదురైంది. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే వారు చేసిన నేరం. మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పూర్ జిల్లా...

ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంటకు ఘోర అవమానం ఎదురైంది. పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడమే వారు చేసిన నేరం. మధ్యప్రదేశ్‌ అలీరాజ్‌పూర్ జిల్లా హర్దాస్‌పూర్‌‌లో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్‌దాస్‌పూర్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల యువకుడు, 21 ఏళ్ల యువతి గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. రెండు నెలల పాటు గుజరాత్‌లో ఉన్న ఈ నవ దంపతులు.. ఇటీవలే అలీరాజ్‌పూర్‌లోని తన మామ నివాసానికి(యువకుడి మేనమామ) చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని దంపతులను జులై 25న కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత నవదంపతులను తీవ్రంగా కొట్టి.. గుండు గీయించారు. అందరూ చూస్తుండగానే వీరిద్దరికి మూత్రం తాగించారు. అయితే ఈ దృశ్యాన్ని కొందరు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి.. సామాజిక మాధ్యమాలలో వైరల్ చేశారు. ఇక బాధిత దంపతులిద్దరూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇద్దరిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories